Teesta Setalvad: తీస్తా సెతల్వాద్‌కు రెగ్యులర్ బెయిల్

Teesta Setalvad: తీస్తా సెతల్వాద్‌కు రెగ్యులర్ బెయిల్
హైకోర్టు తీర్పును రద్దుచేసిన సుప్రీంకోర్టు

గుజరాత్ అల్లర్లుకు సంబంధించిన కేసులో హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ కు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కల్పిత సాక్ష్యాలను సృష్టించారన్న ఆరోపణల కేసులో తీస్తా సెతల్వాద్‌పై ఛార్జిషీటు దాఖలు చేసిన విషయంలో ఆమెను కస్టడీలో పెట్టి ఇంటరాగేషన్ అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ కు గుజరాత్ అల్లర్లకు సంబంధించి కల్పిత సాక్ష్యాలను సృష్టించారన్న ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. తీస్తా సెతల్వాద్‌పై ఛార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీలో ఇంటరాగేషన్ అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సెతల్వాద్‌కు రెగ్యులర్ బెయిల్ తిరస్కరిస్తూ, తక్షణం లొంగిపోవాలంటే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయం హేతబద్ధంగా లేదని కోర్టు అభిప్రాయపడింది.

కస్టడీలో ఉన్నప్పుడే ఆమె తమ పాస్‌పోర్ట్‌ను సెషన్స్ కోర్టుకు సరెండర్ చేశారనీ, ఇప్పుడు రెగ్యులర్ బెయిలు మంజూరు చేస్తున్నందున సాక్ష్యాలను తారుమారు చేసే ఎలాంటి ప్రయత్నాలు చేయరాదని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ సాక్ష్యాలను ప్రభావితం చేసే ఎలాంటి ప్రయత్నాలు జరిగినా గుజరాత్ పోలీసులు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావచ్చని కూడా తెలిపింది. గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం, పోలీసులకు తీస్తా సెతల్వాద్ తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై గతంలో ఆమెపై కేసు నమోదైంది. అమాయకులను కేసులో ఇరికించేందుకు ఆమె కుట్ర పన్నారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ఆ కేసులోనే ప్రస్తుతం ఆమెకు రెగ్యులర్ బెయిల్ లభించింది.అయితే విచారణ సందర్బంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసిన సమయం, అరెస్ట్‌ వెనుక ఉద్దేశంపై రకరకాల ప్రశ్నలు లేవనెత్తింది.

Tags

Read MoreRead Less
Next Story