Hijab Issue: హిజాబ్‌పై అత్యవసర విచారణ వద్దు: సుప్రీం కోర్టు

Hijab Issue: హిజాబ్‌పై అత్యవసరంగా విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హోలీ సెలవుల అనంతరం.. విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు విద్యార్ధినిలు.
హిజాబ్‌పై మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. విద్యా సంస్థల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది హైకోర్టు . హిజాబ్ ధరించడం మతపరమైన ఆచారం కాదని స్పష్టం చేసింది. అయితే.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు విద్యార్ధినిలు. అయితే.. దీన్ని అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది త్రిసభ్య ధర్మాసనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com