సుప్రీంకోర్టు న్యాయవాది హత్య.. భర్తే హంతకుడు

సుప్రీంకోర్టు న్యాయవాది హత్య.. భర్తే హంతకుడు
రెండు రోజులుగా ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో న్యాయవాది సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

రెండు రోజులుగా ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో న్యాయవాది సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ షాకింగ్ సంఘటనలో, 62 ఏళ్ల సుప్రీంకోర్టు న్యాయవాదిని ఆమె భర్త నోయిడా బంగ్లాలో హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆస్తి తగాదా కారణంగానే ఆమె హత్యగావింపబడిందని పోలీసులు అధికారులు తెలిపారు.

అజయ్ నాథ్, 62 ఏళ్ల మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. అతని భార్య, సుప్రీంకోర్టు న్యాయవాది రేణు సిన్హాను హత్య చేసిన ఆరోపణలపై అతడిని అరెస్టు చేశారు.

రెండు రోజులుగా సిన్హా పదే పదే ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సిన్హా సోదరుడుకి అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బంగ్లాలోకి ప్రవేశించి దర్యాప్తు చేపట్టగా బాత్‌రూమ్‌లో సిన్హా మృతదేహం కనిపించింది.

అదృశ్యమైన నాథ్‌ను వెతకడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే బంగ్లాలోని స్టోర్ రూమ్‌లో నాథ్ దాక్కున్నట్లు సమాచారం అందడంతో అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి అతడిని పట్టుకున్నారు. నాథ్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ ప్రారంభించారు.

విచారణ అనంతరం, ఆస్తి తగాదాల కారణంగా సుప్రీంకోర్టు న్యాయవాది భార్యను హత్య చేసినట్లు నాథ్ అంగీకరించాడు. నాథ్ వారి బంగ్లాను రూ.4 కోట్లకు విక్రయించాలని ప్లాన్ చేసి, దానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే, సిన్హా ఈ అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హత్యాకు ముందు సిన్హా క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. ఒక నెలరోజుల ముందే ఆమెకు క్యాన్సర్ పూర్తిగా నయమైందని డాక్టర్లు నిర్ధారించారు.

ప్రాథమిక పరిశోధనలు సిన్హా అధిక రక్తస్రావం కారణంగా మరణించి ఉండవచ్చని సూచించాయి, అయితే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం పోస్ట్‌మార్టం తర్వాత నిర్ధారించబడుతుంది.

ఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరించిన అధికారులు, ప్రస్తుతం సమగ్ర విచారణ జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story