Supreme Court : జ్ఞానవాపిలో పూజలపై స్టేకు సుప్రీంకోర్టు నో

Supreme Court : జ్ఞానవాపిలో పూజలపై స్టేకు సుప్రీంకోర్టు నో
X
ద‌క్షిణ వైపు సెల్లార్‌లో పూజ‌ల‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్‌

వారణాసి లోని జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకోవడంపై స్టే విధించడానికి సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. అయితే మసీదులో ముస్లింలు, హిందువులు ఎప్పటి మాదిరిగా పూజలు చేసుకోవాలని స్టేటస్ కో (యథాతథ స్థితి) విధించింది.

“జనవరి 17, జనవరి 31న ఉత్తర్వులు జారీ అయిన తరువాత ముస్లిం సమాజం నమాజు చేసుకోడానికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని, అలాగే హిందూ పూజారి టెహ్‌ఖానా ఏరియాకు మాత్రమే పరిమితం కావాలని గుర్తుంచుకోవాలని, అందుకనే ఇరు వర్గాలు తమతమ ప్రార్థనలు చేసుకోడానికి వీలుగా పై షరతుల ప్రకారం యథాతథ స్థితి కొనసాగించాలని ధర్మాసనం సూచించినట్టు లీగల్ వెబ్‌సైట్ లైవ్ లా ఉదహరించింది. మసీదు లోని దక్షిణ సెల్లారులో హిందువుల పూజలకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణ జులైకు వాయిదా వేసింది.

మసీదు లోపల హిందువులు పూజ చేయడాన్ని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. మసీదులో గల వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. దానిని అంజుమన్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది . అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సోమవారం నాడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది. ఎప్పటిలాగే ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు ఉత్తరం వైపు నుంచి రావాలని, హిందువులు పూజలు నిర్వహించుకునేందుకు దక్షిణం వైపు నుంచి రావాలని సూచించింది.

ఇక మసీదు సెల్లార్‌లో హిందువులు పూజ‌లు చేసేందుకు అనుమ‌తి నిరాక‌రించాల‌న్న మసీదు క‌మిటీ పిటిష‌న్‌ను ఫైన‌ల్‌గా జులైలో విచారిస్తామ‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. కాగా, మ‌సీదు సెల్లార్‌లో హిందువులు పూజ‌లు చేసుకోవ‌చ్చ‌ని గ‌తంలో వార‌ణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సైతం ధ్రువీక‌రించిన విష‌యం తెలిసిందే.

Tags

Next Story