National: నీట్-పీజీ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఆదివారం జరగాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయడానికి శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలు రాయాల్సిన నగరాలను అభ్యర్థులకు ఇప్పటికే కేటాయించారని, చివరి నిమిషంలో వాయిదా వేస్తే చాలా అవస్థలు పడుతారని తెలిపింది. అయిదుగురు విద్యార్థుల కోసం 2లక్షల మంది భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టలేమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ మనోజ్మిశ్రాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వచ్చి పరీక్షలు వాయిదా వేయాలని అడుగుతున్నారు. ఇలాంటి పరీక్షను ఎలా వాయిదా వేస్తాం? ఒకవేళ వాయిదా వేస్తే 2లక్షల మంది విద్యార్థులు, 4లక్షల మంది తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటారు’’ అని వ్యాఖ్యానించింది.
నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నెల 11న జరగనున్న ఈ పరీక్షకు పలువురు అభ్యర్థులకు దూరప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం తిరస్కరించింది. ‘ఇలాంటి పరీక్షను మేము ఎలా వాయిదా వేయగలం. ఈ రోజుల్లో కొందరు కేవలం పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ వస్తున్నారు. మేము విద్యా సంబంధ నిపుణులం కాదు. ఈ పరీక్ష షెడ్యూల్ను మార్చలేం. పరీక్షను వాయిదా వేస్తే వారాంతంలో రెండు లక్షల మంది విద్యార్థులు, నాలుగు లక్షల మంది తల్లిదండ్రులు రోదించాల్సి వస్తుంది. ఇంతమంది అభ్యర్థుల కెరీర్ను ప్రమాదంలో పెట్టలేం. ఈ పిటిషన్ల వెనుక ఎవరున్నారో మాకు తెలియదు’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, ఈ పరీక్ష జూన్ 23న జరగాల్సి ఉండగా, పోటీ పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర వైద్య శాఖ పరీక్షను వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com