Supreme Court: టీనేజీ శృంగారాన్ని నేరంగా పరిగణించడంపై మీ వైఖరేంటీ?

Supreme Court: టీనేజీ శృంగారాన్ని నేరంగా పరిగణించడంపై మీ వైఖరేంటీ?
X
స్పందన తెలియజేయాలని కేంద్రానికి సుప్రీం నోటీసులు... రోమియో-జూలియట్‌ చట్టాన్ని ప్రస్తావించిన న్యాయవాది

యుక్త వయసులో పరస్పర అంగీకారంతో జరిపే శృంగారాన్ని నేరంగా పరిగణించకూడదని దేశ సర్వోన్నత్ న్యాయస్థానం(Supreme Court )లో ఓ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం సమాధానం(Centre's response) కోరింది. 16 నుంచి 18 ఏళ్ల వయసున్న వారు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే( decriminalise consensual teenage sex దాన్ని నేరంగా పరిగణించకూడదని దాఖలైన వ్యాజ్యంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టు సమాధానం కోరింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ, హోంశాఖ, జాతీయ మహిళా కమిషన్‌ సహా ఇతర చట్టబద్ధ సంస్థలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌(Chief Justice D Y Chandrachud), జస్టిస్‌ జేబీ పార్దీవాలా(J B Pardiwala), జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా( Manoj Misra)లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.


16 నుంచి 18 ఏళ్ల వయసున్న యువత(under-18 girls and over-18 boys engage in consensual sex ) పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే చట్టప్రకారం నేరంగా పరిగణిస్తున్నారని, దీని చట్టబద్ధతను సవాలు చేస్తూ హర్ష్‌ విభోర్‌ సింఘాల్‌ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 18 ఏళ్ల వయసులోపు ఉన్న వారు పరస్పర అంగీకారంతో లైంగిక చర్యలో పాల్గొంటున్నారని, ఒకవేళ బాలిక గర్భం దాల్చిన సందర్భాల్లో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు చేస్తే బాలుడిని అరెస్ట్‌ చేస్తున్నారని పేర్కొన్నారు.

పోక్సో చట్టం(POCSO Act) ప్రకారం 18 ఏళ్లలోపు వారిని మైనర్లుగా పేర్కొంటూ లైంగిక చర్యను నేరంగా పరిగణిస్తున్నారని సింఘాల్‌ పేర్కొన్నారు. ఐపీసీ 375 కింద 16 ఏళ్లలోపు బాలికతో ఆమె అంగీకారంతో లైంగిక చర్యలో పాల్గొన్నా నేరంగా పరిగణిస్తున్నారని తెలిపారు. అయితే, బాలిక వయసు కంటే బాలుడి వయసు నాలుగేళ్ల కంటే ఎక్కువ కానప్పుడు అరెస్ట్‌ నుంచి మినహాయిస్తూ రోమియో- జూలియట్‌ లా(ROMEO-JULIET LAW)ను కొన్ని దేశాలు అనుసరిస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీన్ని భారత్‌లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రం సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది.

Tags

Next Story