రామ్ దేవ్ బాబా పతంజలిపై సుప్రీం ఆగ్రహం

రామ్ దేవ్ బాబా  పతంజలిపై సుప్రీం ఆగ్రహం

యోగా గురువు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీ ఉత్పత్తుల ప్రచారం, వాటి సామ ర్ధ్యానికి సంబంధించిన ప్రకటన విషయంలో కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అమను ల్లాతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదె శాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూ డదో చెప్పాలని రామవ్ బాబాకు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు నోటీస్లు జారీ చేసింది.

ప్రకటనల విషయంలోనూ కొన్ని సూనలు చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చూసీచూనట్లుగా వ్యవహరించడాన్ని కోర్టు తప్పు పట్టింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎలాంటి ప్రకటనలూ ఇవ్వవద్దని మరోసారి హెచ్చరించింది. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నా రంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత సంవత్సరం నవంబర్ లో పతంజలిని మందలించింది. వివిధ రకాల వ్యాధులను నయం చేస్తుందంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వవద్దని సూచించింది. లేకుంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలు జరగవంటూ అప్పట్లో సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పతంజలి ప్రకటన విషయంలో కేంద్రం చూసీచూడనట్లుగా వ్యవహరిం చడాన్ని తప్పుపట్టింది. ఇలాంటి ప్రకటన విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ప్రజలను తప్పుదోవ పట్టించడంపై నిర్లిప్తంగా ఉండటం సరైంది కాదని స్పష్టం చేసింది

Tags

Read MoreRead Less
Next Story