Priyanka Gandhi: ప్రియాంక గాంధీతో భేటీ అయిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు.. అదే ప్లాన్..!

Priyanka Gandhi: ప్రియాంక గాంధీతో భేటీ అయిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు.. అదే ప్లాన్..!
Priyanka Gandhi: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు.

Priyanka Gandhi: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఇవాళ సాయంత్రం ఈ భేటీ జరిగింది. మునుగోడు ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అనే అంశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగింది.

సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్‌‌ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్ , శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఆహ్వానం అందినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సమావేశానికి వెళ్లలేదు

Tags

Read MoreRead Less
Next Story