Tamil Nadu: గబ్బిలాలతో చిల్లీ చికెన్, ఇద్దరు అరెస్ట్,

తమిళనాడు రాష్ట్రంలో ‘‘గబ్బిలాల’’ వేట కలకలం రేపుతోంది. గబ్బిలాలను చంపి, వాటిని సమీపంలో హోటల్స్‌లో చిల్లీ చికెన్‌లా తయారు చేస్తున్న ముఠా పట్టుబడింది. సేలం జిల్లా డేనిష్ పేటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డానిష్ పేటలోని అటవీ ప్రాంతంలో తుపాకులతో గబ్బిలాలను వేటాడుతున్న సెల్వం, కమల్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, గబ్బిలాలను ఎందుకు వేటాడుతున్నారని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో, దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. గత కొన్ని నెలలుగా గబ్బిలాలను చంపి సమీపంలోని హోటల్స్‌కి చిన్న చిన్న ముక్కలుగా చేసి పంపుతున్నట్లు సెల్వం, కమల్ వెల్లడించారు. చిల్లి చికెన్‌కు అవసరయ్యే సైజులో ముక్కలుగా కోసి పంపుతున్నట్లు తేలింది. మద్యం షాపుల వద్ద చికెన్ పడోడా రూపంలో విక్రయిస్తున్నట్లు విచారణలో ఇద్దరు అంగీకరించారు. ఇద్దర్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. గతంలో చెన్నై సిటీలో కుక్కలను, పిల్లులను చంపి పలు హోటల్స్‌లో మటన్ బిర్యానీగా అమ్మిన సంఘటనలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com