చికెన్ షవర్మా తిని యువతి మృతి.. చికిత్స పొందుతున్న మరో 13 మంది వైద్య విద్యార్థులు

చికెన్ షవర్మా తిని యువతి మృతి.. చికిత్స పొందుతున్న మరో 13 మంది వైద్య విద్యార్థులు
తమిళనాడులో చికెన్ షవర్మా తిని ఫుడ్ పాయిజన్ అయి ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

తమిళనాడులో చికెన్ షవర్మా తిని ఫుడ్ పాయిజన్ అయి ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని నమక్కల్‌లో 14 ఏళ్ల బాలిక ఆదివారం చికెన్ షవర్మా తిని తీవ్ర ఇబ్బంది పడుతూ సోమవారం మరణించింది. బాలిక తండ్రి రెస్టారెంట్ నుండి మాంసాహార పదార్థాలను ఇంటికి తీసుకువచ్చారు. బాలిక తన కుటుంబంతో కలిసి చికెన్ షవర్మాను తిన్నది.

అదే రోజు రాత్రి, ఫుడ్ పాయిజన్ కావడంతో బాలిక తీవ్ర అస్వస్తతకు గురైంది. కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి ఇంటికి పంపించారు. అయినా బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ సోమవారం మృతి చెందింది. ఇదే రెస్టారెంట్‌లో మాంసాహారం తిని 13 మంది వైద్య విద్యార్థులు కూడా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

అధికారులు వెంటనే రెస్టారెంట్‌పై దాడి చేసి, ఆహార నమూనాలను సేకరించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గ్రిల్డ్ చికెన్, తందూరీ చికెన్ లేదా షవర్మా తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిన వారికి చికెన్ ఎక్కడి నుంచి లభించిందనే విషయాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ టీమ్ ఎంక్వైరీ చేసింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story