Jallikattu 2022: ఒమిక్రాన్ సమయంలోనూ జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్..

Jallikattu (tv5news.in)
Jallikattu 2022: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో తమిళనాడులో ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు క్రీడలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జల్లికట్టు నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. 150 మంది వీక్షకులను లేదా మొత్తం సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని ఆదేశించింది.
జల్లికట్టులో పాల్గొనేందుకు రిజిస్టర్ చేయించుకున్న ఎద్దుల యజమానులు, వారి సహాయకులు తప్పనిసరిగా రెండు డోసుల పూర్తి వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ సమర్పించాలి. దీనితో పాటు కనీసం 48 గంటల ముందు తీయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా అందజేయాలి.
అనంతరం వారికి ఐడెంటిటీ కార్డులను అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. జిల్లా యంత్రాంగం ఇచ్చే ఐడెంటిటీ కార్డులున్న వారినే క్రీడాఆవరణలోకి అనుమతిస్తామని పేర్కొంది. జల్లికట్టులో పాల్గొనే జంతువులకు ఎలాంటి హాని చేయకూడదని కూడా స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com