హిందీ హోర్డింగ్‌లు, సినిమాలు, పాటలపై నిషేధం.. బిల్లు ప్రవేశపెట్టనున్న తమిళనాడు ప్రభుత్వం..

హిందీ హోర్డింగ్‌లు, సినిమాలు, పాటలపై నిషేధం.. బిల్లు ప్రవేశపెట్టనున్న తమిళనాడు ప్రభుత్వం..
X
హిందీ హోర్డింగ్‌లు, బోర్డులు, సినిమాలు మరియు పాటలను నిషేధిస్తూ తమిళనాడు నేడు ఒక బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.

హిందీ హోర్డింగ్‌లు, బోర్డులు, సినిమాలు, పాటలను నిషేధిస్తూ తమిళనాడు నేడు ఒక బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ చర్య రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని అధికారులు నొక్కి చెప్పారు. బిజెపి దీనిని అసంబద్ధ చర్యగా అభివర్ణించింది.

తమిళనాడు ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు రాష్ట్రంలో హిందీని విధించడాన్ని నిషేధించే లక్ష్యంతో ఉందని వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం.

సీనియర్ డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలంగోవన్ బిల్లపై వ్యాఖ్యానిస్తూ.. "మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయము. దానికి కట్టుబడి ఉంటాము. కానీ హిందీని రుద్దడాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము" అని అన్నారు.

బిజెపికి చెందిన వినోజ్ సెల్వం ఈ చర్యను "మూర్ఖత్వ చర్య" అని అభివర్ణించారు. భాషను రాజకీయ సాధనంగా ఉపయోగించరాదని వాదించారు.

తిరుపరంకుండ్రం, కరూర్ దర్యాప్తు, ఆర్మ్‌స్ట్రాంగ్ సమస్యలతో సహా ఇటీవలి కోర్టు కేసుల్లో ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న అధికార డీఎంకే, వివాదాస్పద ఫాక్స్‌కాన్ పెట్టుబడి సమస్య నుండి దృష్టిని మళ్లించడానికే ఇలాంటి చర్యలకు పూనుకుంటోందని ఆయన అన్నారు.


Tags

Next Story