Tamil Nadu Rains: భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం..

వరుసగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి తమిళనాడులో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా ఆ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడులో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరుకోవడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి తమిళనాడులోని ప్రధాన రోడ్లు నదులు, చెరువులను తలపిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో తమిళనాడులో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కడలూరు, మైలదుతురై, నాగపట్నం, తిరువారూర్, పుదుచ్చేరిలోని కారైకల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, తంజావూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ఐదు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఎడతెరిపి లేని భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు ఇప్పటికే సెలవు ప్రకటించారు. చెన్నైలోని పాఠశాలలు, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరి, కారైకల్‌లలో పాఠశాలలు, కళాశాలలకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా స్కూళ్లు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు. మరోవైపు.. రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com