K Annamalai: కొరడా దెబ్బలతో మొక్కు చెల్లించుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్

K Annamalai: కొరడా దెబ్బలతో మొక్కు చెల్లించుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్
X
డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను పాదరక్షలు ధరించను: కె. అన్నామలై

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని అన్నాయూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుని.. మురుగన్‌కు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ.. రాష్ట్రంలో స్టాలిన్ సర్కార్ ను గద్దె దించేందుకు ఇవాళ్టి నుంచి 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేస్తానని శపథం చేశారు.

ఇక, గురువారం నాడు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను పాదరక్షలు ధరించను అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి రూపాయి కూడా పంచమని తెలిపారు. అయితే, డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని కె. అన్నామలై చెప్పుకొచ్చారు.

Tags

Next Story