Stalin : సీఎం స్టాలిన్‌కు కరోనా..

Stalin : సీఎం స్టాలిన్‌కు కరోనా..
X
Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కరోనాతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు.

Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కరోనాతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని స్టాలిన్ స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపారు. తొలుత రెండ్రోజులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయితే ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని… ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

కరోనా కేసులు పెరుగుతున్న వేళ అందరూ మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్‌లు తీసుకోవాలని స్టాలిన్ ప్రజలను కోరారు. అటు తమిళనాడు గవర్నర్, మాజీ సీఎం పన్నీర్ సెల్వం.. స్టాలిన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags

Next Story