Nano : నానో కేసులో టాటా విజయం..

టాటా మోటార్స్‌కు గొప్ప ఉపశమనం కలిగింది. పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో లఖ్టాకియా నానో కార్ల తయారీ కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను మూసివేసిన తర్వాత పెట్టుబడిపై నష్టాన్ని వడ్డీతో కలిపి రూ.766 కోట్లు అందనున్నాయి. ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ అంటే ఆర్బిట్రల్ ట్రిబ్యునల్.. తాజాగా టాటా మోటార్స్‌కు అనుకూలంగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
సింగూర్‌లో కార్ల తయారీ ప్లాంట్ వదిలి పెట్టి పోవలసిన వ్యవహారంలో ఏర్పడిన పెట్టుబడి నష్టానికి సంబంధించిన దావాలో పశ్చిమ బెంగాల్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌పై (డబ్ల్యూబీఐడీసీ) టాటామోటార్స్ గెలుపు సాధించింది. టాటా మోటార్స్‌కు పరిహారంగా రూ.765.78 కోట్లు చెల్లించాలని డబ్ల్యూబీఐడీసీని కోర్టు ఆదేశించింది. ముగ్గురు సభ్యుల ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో కంపెనీ తెలియచేసింది. 2016 సెప్టెంబరు ఒకటోతేదీ నుంచి వాస్తవ రికవరీ తేదీ వరకు 11 శాతం వార్షిక వడ్డీతో సహా సొమ్మును చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
టాటా మోటార్స్ లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యుబీఐడీసీ) మధ్య సింగూరులోని ఆటోమొబైల్ తయారీ ప్లాంట్‌పై పెట్టుబడి పెట్టిన పెట్టుబడి నష్టానికి డబ్ల్యుబీఐడీసీ నుంచి పరిహారం కోసం టాటా మోటార్స్ దావా వేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టాటా మోటార్స్ తెలిపింది. అక్టోబర్ 30, 2023న టాటా మోటార్స్ లిమిటెడ్‌కు అనుకూలంగా సభ్యుల మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది.
సెప్టెంబర్ 1, 2016 నుంచి ఏటా 11 శాతం వడ్డీతో పశ్చిమ బెంగాల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి టాటా మోటార్స్ రూ.765.78 కోట్లను రికవరీ చేసుకోవచ్చని ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విచారణలో జరిగిన కోటి రూపాయల ఖర్చులను కూడా రికవరీ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించిందని టాటా మోటార్స్ తెలిపింది. ఈ నిర్ణయంతో, మధ్యవర్తిత్వానికి సంబంధించి జరుగుతున్న విచారణ ఇప్పుడు ముగిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com