వారంలో ౩రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే: TCS

కరోనా ఆంక్షలు ముగిసిన తర్వాత అనేక IT కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు స్వస్తి పలుకుతున్నాయి. పలు సంస్థలు హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుండగా.. మరికొన్ని మాత్రం పూర్తిస్థాయిలో ఆఫీసు నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో IT దిగ్గజ సంస్థ TCS కూడా వారంలో మూడు రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. వారంలో మూడ్రోజులు ఆఫీసుకు రావాలని తమ ఉద్యోగులకు TCS గత అక్టోబర్ నుంచే సూచిస్తోంది. అలా నెలకు 12రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ, కొందరు ఉద్యోగులు ఈ నిబంధనను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో అలాంటి వారికి తాజాగా నోటీసులు పంపిస్తోంది. తక్షణమే వచ్చి రిపోర్టు చేయాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com