రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల, వైసీపీ ఎంపీ విజయసాయి మధ్య వాగ్వాదం

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల, వైసీపీ ఎంపీ విజయసాయి మధ్య వాగ్వాదం
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కోవిడ్‌-19 నివారణ చర్యలపై చర్చ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం..

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కోవిడ్‌-19 నివారణ చర్యలపై చర్చ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడాల్సిన విజయసాయిరెడ్డి.. ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం అంటూ ఇతర అంశాలు ప్రస్తావించడంపై కనకమేడల అభ్యంతరం తెలిపారు. అనవసర అంశాల ప్రస్తావన తెస్తూ సభను తప్పుదోవ పట్టించడం తగదని వారించారు. కోర్టుల పరిధిలోకి వచ్చే అంశాల్ని ప్రస్తావించడంపై అభ్యంతరం తెలిపిన కనకమేడల... విజయసాయిరెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ ఛైర్మన్‌ను కోరారు.

Tags

Next Story