Karnataka : పాకిస్థాన్‌కు వెళ్లమన్న టీచర్… బదిలీ

ఒక్కోసారి విద్యార్థులు చేసే అల్లరికి టీచర్లు తిడతారు, అవసరం అయితే కొడతారు అయితే గతంలో ఇవన్నీ చాలా కామన్. కానీ ఇప్పుడు అలా కాదు. కాస్త అదుపు తప్పి మాట్లాడినా ఆ మాటలు వివాదాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా మతపరమైన విషయాలైతే పోలీస్ కేసుల వరకు వెళ్తున్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ టీచర్ క్లాస్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి పాకిస్థాన్‌కు వెళ్లండి.. ఇది హిందూ దేశం అని అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు వారి కుటుంబంతో కలిసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శివమొగ్గ జిల్లాలోని ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులు ఆమెపై విచారణ ప్రారంభించారు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ముస్లిం విద్యార్థులపై మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. క్లాస్ చెబుతుండగా ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. ఇది చూసి అసహనం వ్యక్తం చేసిన ఆ టీచర్ వెంటనే వాళ్లపై అరిచింది. ఆ క్రమంలోనే పాకిస్థాన్‌కి వెళ్లిపోండి అని తిట్టింది. ఇది హిందువుల దేశం అని, ఇక్కడ మీకు చోటు లేదని మండి పడింది.
ఈ సంఘటనతో తో ఉపాధ్యాయురాలిని బదిలీ చేశారు. కొందరు ముస్లిం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆమెపై అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆరోపించిన ప్రకటనకు ఖచ్చితమైన రుజువు లేనప్పటికీ, విద్యార్థుల ఫిర్యాదుల ఆధారంగా చర్య తీసుకున్నట్లు విద్యాశాఖాధికారులు ధృవీకరించారు. మరోవైపు ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో పోలీసులు కూడా టీచర్ వ్యాఖ్యలపై విచారణ ప్రారంభించారు.
కొద్దిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ లోని తృప్తి త్యాగి అనే మహిళా టీచర్ పాఠశాలలోని ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వీడియో వైరల్ అవడం వల్ల ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో స్కూల్‌ని బంద్ చేయాలని యోగి సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే విద్యాశాఖ కూడా ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టింది.యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ముస్లిం విద్యార్థిని తోటి పిల్లలతో టీచర్ కొట్టించారు. చివరికి పిల్లాడిని దండించాలనే తప్పా మతపరమైన ఉద్దేశం తనకు లేదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com