బుద్దిలేని ఉపాధ్యాయులు.. విద్యార్థినులను లైంగికంగా వేధించడంతో..

కామంతో కళ్లు మూసుకుపోతున్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు అసాంఘీక చర్యలకు పాల్పడుతున్నారు. బాలికలకు బడిలోనూ రక్షణ లేకుండా పోతోంది. కర్ణాటకలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఇద్దరు ఉపాధ్యాయులను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
సంబంధిత ఉపాధ్యాయులను చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీపీఐ) పరమేశ్వరప్ప ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలపై కర్ణాటక విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
సస్పెండ్ అయిన ఉపాధ్యాయులను హెడ్ మాస్టర్ నాగరాజ్ కోరి, అసిస్టెంట్ టీచర్ శాంతకుమార్‌గా గుర్తించారు. ఈ ఘటన సొప్పినకేరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థులు ఉపాధ్యాయుడు శాంతకుమార్‌పై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ మేరకు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో) నివేదిక సమర్పించడంతో విద్యాశాఖ స్పందించి సదరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com