Delhi: ఢిల్లీలో తరుణ్‌ చుగ్‌తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. పలు ఆరోపణల గురించి చర్చ..

Delhi: ఢిల్లీలో తరుణ్‌ చుగ్‌తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. పలు ఆరోపణల గురించి చర్చ..
Delhi: ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతలు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ నివాసంలో భేటీ అయ్యారు.

Delhi: ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతలు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌, డీకే అరుణ, రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి సహా ముఖ్యనేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ నేతలపై దాడులు, టీఆర్ఎస్‌ పత్రిక, ఛానెల్‌లో అసత్యకథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ నేతలు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ పోరాడుతోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ . కేసీఆర్ అనేక కుట్రలు పన్నుతున్నారని, బీజేపీని అణిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. అబద్దాలను నిజాలు చేసేందుకు యత్నిస్తున్నారని, ప్రధాని వ్యాఖ్యలని వక్రీకరించి తన పత్రికలో ప్రచురించారన్నారు బండి సంజయ్‌. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు బండి సంజయ్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తోందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌. సీఎం కేసీఆర్ చేసిన వాగ్ధానాలు నిలబెట్టుకోలేదన్నారు. ప్రజల సొమ్ము ఎలా దోచుకోవాలో కేసీఆర్‌కు మాత్రమే తెలుసని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ పోరాటం ఆగదన్నారు తరుణ్‌ చుగ్‌. అవినీతికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపి మాత్రమే పోరాడుతుందని స్పష్టం చేశారాయన.

Tags

Next Story