Piyush Goyal: ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అబద్ధాలు: పీయూష్ గోయల్‌

Piyush Goyal (tv5news.in)

Piyush Goyal (tv5news.in)

Piyush Goyal: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వివాదం ఢిల్లీకి చేరింది.

Piyush Goyal: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వివాదం ఢిల్లీకి చేరింది. ధాన్యం కొనుగోళ్ల విషయం తేల్చుకునేందుకు రెండు రోజుల క్రితమే తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి చేరుకుంది. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌ కోసం రెండు రోజులు ఎదురుచూశారు మంత్రులు. ఐతే మంత్రులతో భేటీ కంటే ముందు రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిష్ రెడ్డి కూడా హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు.

రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ తర్వాత మాట్లాడిన కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌...తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. రైతులను తెలంగాణ ప్రభుత్వం గందరగోళపరుస్తోందని ఆరోపించారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు.

20 లక్షల బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేందుకు కూడా అంగీకరించామన్నారు. ఈ అవకాశం కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామన్నారు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదని.. నాలుగు సార్లు గడువు కూడా పొడిగించినట్లు చెప్పారు. FCIకి ధాన్యం సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు.

సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హుజురాబాద్‌లో ఓటమి తర్వాతే సీఎం కేసీఆర్ బియ్యం అంశాన్ని లేవనెత్తారని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కూడా కేటాయింపులు చేసి రైతులను ఆదుకోవాలన్నారు కిషన్ రెడ్డి. రా రైస్‌, బాయిల్డ్ రైస్‌ రెండు కలిపి 27 లక్షల 39 లక్షల మెట్రిక్‌ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం FCIకి సరఫరా చేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశం తర్వాత అమిత్‌ షాతో భేటీ అయ్యారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఈ సమావేశానికి పీయూష్ గోయల్‌ కూడా హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story