Ayodhya: ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేలా..

Ayodhya: ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేలా..
కొత్తరూపు సంతరించుకుంటున్న అయోధ్య నగరం

అయోధ్యలో నగర సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి.రహదారులు,కూడళ్లు, వంతెనలు, గోడలు, ఇలా ఎక్కడ చూసినారామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలతో ఔరా అనిపించే కళాఖండాలు దర్శనమిస్తున్నాయి.ఆయా పెయింటింగ్స్‌తో నగరమంతటా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది.

అయోధ్య రామాలయంలో రాముడి ప్రతిమ ప్రాణప్రతిష్ఠకు గడువు సమీపిస్తున్న వేళ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నగరంలోని పెద్ద గోడలు, వంతెనల కోర్‌లు, సరయు, తమ్స నదీ తీరాలు, ఇలా ఎక్కడ చూసినా రామాయణ గాథలోని ఘట్టాలన్నీ దర్శనమిస్తున్నాయి. వాటిని కుడ్య చిత్రాలు, శిల్పాల రూపంలో స్థానిక యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. వాటి ద్వారా నగరాన్ని అందంగా తీర్చిదిద్దడం సహా..రామాయణాన్ని జ్ఞప్తికి తెస్తూ సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా రూపకల్పన చేస్తున్నారు. మొత్తం 180 కుడ్యచిత్రాలను టెర్రకోట కళతో ముస్తాబు చేస్తున్నారు.


రామాయణ ఘట్టాలు ఉట్టిపడేలా అయోధ్యలో అలంకరణలు జరుగుతున్నాయి. పౌరాణిక చిత్రాలతో గోడల్ని అలంకరిస్తున్నారు. ఇక ఆలయంలోని ప్రతి స్తంభంపైన రాముడి చిత్రాలు ఉండేలా చూస్తున్నారు. ఆలయ ముఖద్వారం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతో పులకిస్తారనే భావన వ్యక్తమవుతోంది. కాంక్రీట్ సీటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, సందర్శకులు ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా.. అన్ని అంశాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయోధ్య అభివృద్ధి మండలిని ఆదేశించింది.

ఆలయానికి కొత్త రూపు ఇచ్చే పనులు గత 15 రోజులుగా ముమ్మరం అయ్యాయి. సందర్శకులు అయోధ్య నగర సాంస్కృతిక వారసత్వంతో మమేకం అయ్యే పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సుమారు 22 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ పనులు చేపట్టారు. అయోధ్య సుందరీకరణ పనులు చాలా కళాత్మకంగా ఉంటాయని, నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో ఇవి కీలకం అంటోంది అయోధ్య అథారిటీ చెబుతోంది.


మరోవైపు కాశీ మాదిరిగానే అయోధ్యను హిందువులు అంత్యక్రియలు నిర్వహించుకునే పవిత్ర స్థలంగా తీర్చిదిద్దుతోంది యూపీ ప్రభుత్వం. దహన సంస్కారాల కోసం ఉచితంగా కలపను అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం లకడి లేదా కలప బ్యాంక్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ లకడి బ్యాంక్‌.. కోవిడ్‌ సమయంలో ఏర్పాటైంది. వందలాది అనాథ శవాలను దగ్ధం చేసేందుకు ఈ కలప బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చుట్టుపక్కల 20 జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడ తమవారికి అంత్యక్రియలు చేసేందుకు వస్తుంటారు. అయోధ్య పరిసర ప్రాంతాల్లోని అన్ని భవనాల ముందు భాగం ఒకే విధమైన డిజైన్, కలర్‌ థీమ్‌ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రికులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నగర కూడళ్లలో LEDలను ఏర్పాటు చేస్తున్నారు. కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు కూడా ఒకే డిజైన్‌లో ఉండే కాన్సెప్ట్‌ను సిద్ధం చేసింది అయోధ్య ఆథారిటీ. షట్టర్లపై థీమ్ ఆధారిత పెయింటింగ్స్‌ వేయిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 2,800 దుకాణాలు, వాణిజ్య సంస్థలను గుర్తించారు. గోడలపై పెయింటింగ్స్‌, పెయింట్ డిజైన్లు, ఎల్‌ఈడీ ఫిక్చర్లు వంటి చిన్న చిన్న విషయాలను కూడా ఓ ప్రణాళిక ప్రకారం చేపట్టారు. నగర పర్యటనకు వచ్చే సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం 3,500 సీట్లను ఏర్పాటు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story