Ayodhya Ram Temple: దగ్గరవుతున్న రామమందిర ప్రారంభోత్సవం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పిస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వేలాది భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకుగానూ.... డేరాలతో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, అయోధ్యాభివృద్ధి ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో.... మాజా గుప్తర్ ఘాట్, బాగ్ బిజేసీ, బ్రహ్మకుండ్‌తో పాటు మరి కొన్ని చోట్లలో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మాజా గుప్తర్ ఘాట్ వద్ద 20 ఎకరాల్లో 25 వేలమందికి, బ్రహ్మకుండ్ వద్ద 30 వేల మందికి, బాగ్ బిజేసీ వద్ద 25 వేల మందికి వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. కార్‌సేవక్ పురం, మణిరాం దాస్ కంటోన్మెంట్ లాంటి చోట్లలో కూడా వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఇటీవలె ఖరారు అయింది. వచ్చే ఏడాది జనవరి 22 వ తేదీన మృగశిర నక్షత్రంలో అభిజీత్ ముహూర్తంలో 12.20 గంటలకు రాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు. వేలాది మంది భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.
శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ సంస్థలు భక్తులకు తాత్కాలిక వసతుల ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం శీతాకాలంలో సంక్రాంతి పండగ తర్వాత నిర్వహిస్తుండటంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి.. భక్తులు చలికి వణికిపోయే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారిని చలి బారి నుంచి రక్షించేందుకు ఈ టెంట్ సిటీలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. భక్తుల కోసం పరుపులు, దుప్పట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. భక్తుల ఆకలి తీర్చేందుకు ఆహార సరఫరా ఏర్పాట్లు, అనారోగ్యానికి గురైతే వైద్య సహాయం కల్పించేందుకు మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారని.. వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com