TERROR ATTACK: ఎర్రకోట కేసు విచారణలో కొత్త కుమ్మక్కు బహిర్గతం

TERROR ATTACK: ఎర్రకోట కేసు విచారణలో కొత్త కుమ్మక్కు బహిర్గతం
X
జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ మహిళా విభాగం కుట్రలు

దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఎర్రకోట పేలుడు ఘటనతో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ యొక్క మహిళా విభాగం కుట్రలు తెరపైకి వచ్చాయి. ఈ పేలుడుకుట్రలో కీలక పాత్ర పోషించిన డా. షాహిన్‌ షాహిద్.. జైషే మహిళా విభాగమైన ‘జమాత్ ఉల్ మొమినాత్’లో సభ్యురాలని దర్యాప్తు వర్గాలు ధృవీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్రిగేడ్‌కు సంబంధించిన మరింత కీలక సమాచారం నిఘా వర్గాల ద్వారా బయటికొచ్చింది.

నియామకాలు, శిక్షణ వివరాలు

అక్టో­బ­రు 8 నుం­చి జైషే ప్ర­ధాన కా­ర్యా­ల­యం­లో ఈ మహి­ళా బ్రి­గే­డ్ కోసం ని­యా­మ­కా­లు ప్రా­రం­భిం­చి­న­ట్లు నిఘా వర్గా­లు వె­ల్ల­డిం­చా­యి. ఇప్ప­టి­వ­ర­కు ఈ వి­భా­గం­లో 5000 మం­ది­కి పైగా మహి­ళ­లు చే­రి­న­ట్లు తె­లి­సిం­ది. జైషే చీఫ్ మసూ­ద్ అజా­ర్ సైతం ఈ ని­యా­మ­కాల గు­రిం­చి సా­మా­జిక మా­ధ్య­మా­ల్లో పో­స్ట్ చే­సి­న­ట్లు సమా­చా­రం. పా­కి­స్థా­న్‌­లో­ని బహ­వ­ల్‌­పూ­ర్‌, ము­ల్తా­న్‌, సి­యా­ల్‌­కో­ట్‌, కరా­చీ, కొ­ట్లీ, ము­జ­ఫ­రా­బా­ద్‌ ప్రాం­తాల నుం­చి మహి­ళ­ల­ను ని­య­మిం­చు­కుం­టు­న్నా­రు. వీ­రి­కి ప్ర­తి­రో­జూ 40 ని­మి­షాల పాటు ఆన్‌­లై­న్‌­లో కఠిన శి­క్షణ ఇస్తు­న్న­ట్లు తె­లి­సిం­ది. ఐసి­స్, హమా­స్, ఎల్‌­టీ­టీఈ తర­హా­లో మహి­ళ­ల­తో ఆత్మా­హు­తి దా­డు­ల­కు పా­ల్ప­డే­లా వీ­రి­ని ప్రే­రే­పి­స్తు­న్న­ట్లు నిఘా వర్గా­లు పే­ర్కొ­న్నా­యి. ఈ కా­ర్య­క్ర­మం కోసం ఒక్కో మహిళ నుం­చి రూ.500 చొ­ప్పున వి­రా­ళా­లు కూడా సే­క­రి­స్తు­న్నా­రు.

కఠిన నిబంధనలు, కీలక నాయకత్వం

పురుష ఉగ్రవాదుల తరహాలోనే వీరికి కూడా కఠిన శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా, భర్త లేదా కుటుంబ సభ్యులు మినహా తెలియని ఏ పురుషుడితోనూ మాట్లాడకూడదనే కఠిన నిబంధనలు కూడా విధించారు. ఈ మహిళా విభాగానికి మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఆన్‌లైన్ తరగతులకు అఫీరా బీబీ నేతృత్వం వహిస్తున్నారు. ఈమె పుల్వామా ఉగ్రదాడుల సూత్రధారి ఉమర్ ఫరూఖ్ భార్య కావడం గమనార్హం. 2019లో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్‌’ (బాలకోట్ వైమానిక దాడి) సమయంలో జైషే ప్రధాన కేంద్రంపై భారత బాంబులు జారవిడిచినప్పుడు, అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. ఆ ఊహించని దెబ్బ నుంచి కోలుకునే ప్రయత్నంలోనే, అజార్ ముఠా కొత్త కుట్రలకు తెరతీసి, ఈ మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

Tags

Next Story