13 Aug 2022 1:45 AM GMT

Home
 / 
జాతీయ / Nupur Sharma : నుపుర్...

Nupur Sharma : నుపుర్ శర్మను చంపాలనుకున్న ఉగ్రవాది అరెస్ట్..

Nupur Sharma : నుపుర్ శర్మను చంపాలనుకున్న మహ్మద్ నదీమ్ అనే యువకుడిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది

Nupur Sharma : నుపుర్ శర్మను చంపాలనుకున్న ఉగ్రవాది అరెస్ట్..
X

Nupur Sharma : మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను చంపాలనుకున్న మహ్మద్ నదీమ్ అనే యువకుడిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. షహరాన్‌పూర్‌కు చెందిన నదీమ్‌‌ 2018 నుంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. జైష్ ఎ మహ్మద్‌ , తెహ్రీక్ ఎ తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్థలతో నదీమ్‌కు సంబంధాలున్నాయని తేల్చారు. యూపీలో భారీ విధ్వంసానికి కుట్ర చేస్తుండగా నదీమ్‌ను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది.

Next Story