Yasin Malik : తీహార్ జైలులో ఉగ్రవాది యాసిన్ మలిక్ నిరాహార దీక్ష..

Yaseen Malik : తీహార్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మాలిక్ జూలై 22 నుంచి నిరాహార దీక్ష ప్రారంభించాడని చెప్పారు. తన కేసును సక్రమంగా విచారంచిలేదంటూ ఆరోపణలు చేస్తూ... నిరాహారదీక్ష చేపట్టాడని వెల్లడించారు.
వాస్తవానికి యాసిన్ మాలిక్... నిషేధిత జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఐతే అతను 2019లో JKLFని నిషేధించిన కొద్దికాలానికే అరెస్టు అవ్వడమే కాకుండా ఉగ్రవాద నిధుల కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష తోపాటు దాదాపు 10 లక్షల జరిమానా కూడా విధించింది. పైగా అతను తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఫిటిషన్ దాఖలు చేయనని కోర్టుకు తెలిపాడు.
మాలిక్‌పై కిడ్నాప్ కేసు తోపాటు 1990 జనవరిలో శ్రీనగర్‌లో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను కాల్చి చంపిన కేసులో కూడా మాలిక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐతే మాలిక్ ప్రస్తుతం ఈ కేసులో వ్యక్తిగత హాజరు కావాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com