Hyderabad: ఉగ్రవాదులు అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్ లకు 5 ఏళ్ల జైలు శిక్ష

Hyderabad: ఉగ్రవాదులు అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్ లకు 5 ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాది ఉగ్రవాదులు అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్ లకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. 2018లో ఇద్దరినీ అరెస్ట్ చేసిన ఎన్ఐఏ వారిని దోషులుగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్షతోపాటు ఇద్దరికీ రూ. 2000 ఫైన్ విధించింది. ఐసిస్ అబుదాబి మాడ్యూల్ కోసం పనిచేసిన అబ్దుల్ బాసిత్, ఖాదిర్ నగరంలో పేలుళ్లకు కుట్రపన్నారు. ఉగ్రవాదం వైపు యువకులను ఆకర్షితులను చేసేందుకు కంకణం కట్టుకున్న బాసిత్ మరో ఉగ్రవాది అధ్నాన్ హుస్సేన్ నుంచి నిధులు సమకూర్చుకున్నాడు. యువకులకు వీసా పాస్ పోర్ట్ లను అరేంజ్ చేసేవాడు. 2017లో అబ్దుల్ బాసిత్ ఇంటర్వ్యూ చూసి ఆకర్షితుడైన అబ్దుల్ ఖాదిర్, అతడి కార్యక్రమాలు హాజరయ్యేవాడని విచారణలో వెల్లడైంది. 2019లో ఇద్దరిపై సప్లమెంటరీ చార్షీట్ దాఖలు చేయగా, ఇద్దరికీ ఐదు ఏళ్ల పాటు శిక్ష విధిస్తూ ఎన్ ఐ ఎ కోర్టు తీర్పు వెలువరించింది.

Tags

Read MoreRead Less
Next Story