Shantanu Naidu: అందరు అనుకుంటున్నట్టుగా ఈ అబ్బాయి రతన్ టాటా మనవడు కాదు.. ఎవరంటే.?

Shantanu Naidu: ఒక్కొక్కసారి మనం వేసే చిన్న అడుగు ఎలాంటి గమ్యం వైపు నడిపిస్తోంది మనకు కూడా తెలీదు. అలా ఓ కుర్రాడికి పెట్స్ మీద ఉన్న ప్రేమ.. తనను ఏకంగా రతన్ టాటాకు అసిస్టెంట్ హోదాలో కూర్చోబెట్టింది. రతన్ టాటా.. ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా కూడా ఆయన బర్త్‌డేను చాలా సింపుల్‌గా, ఒక కప్ కేక్‌తో జరుపుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకంటే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. ఆ బర్త్‌డే వీడియోలో టాటా పక్కన ఉంది ఆయన అసిస్టెంట్ అని తెలియడం.
A charming scene with the unassuming #RatanTata on his 84th birthday pic.twitter.com/wkmm7jhCyZ
— Harsh Goenka (@hvgoenka) December 29, 2021
టాటా పుట్టినరోజు వీడియోలో ఆయన పక్కన ఉన్న కుర్రాడి పేరు షాంతను నాయుడు. కొన్నేళ్ల క్రితం ఇతడు ఒక సాదాసీదా కాలేజ్ స్టూడెంట్. ఉన్నట్టుండి కుక్కలు రోడ్డు పైకి రావడం వల్ల, లేదా దూరం నుండి వచ్చే వాహనాలకు ఈ కుక్కలు కనపడకపోవడం వల్ల ఎన్నో కుక్కలు ప్రాణాలు విడిచాయి. ఇవి చూసి షాంతను చలించిపోయాడు. వాటి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఆ ఆలోచన నుండి పుట్టిందే 'మోటోపోస్'.
కుక్కలను ఎంత దూరం నుండి చూసినా.. కనిపించేలా వాటికి ఓ కాలర్ తయారు చేశాడు. ఉన్నట్టుండి ఆ కాలర్ ఫేమస్ అయిపోయింది. వెంటవెంటనే షాంతనుకు ఆ కాలర్ కోసం చాలా ఆర్డర్స్ వచ్చిపడ్డాయి. కానీ అప్పటికీ షాంతను స్టూడెంట్ కావడంతో తన 'మోటోపోస్'కు ఫండ్స్ ఇచ్చే వ్యక్తి కావాల్సి వచ్చింది. తన తండ్రి సలహాతో ఏకంగా ఫండింగ్ కోసం రతన్ టాటాకు ఉత్తరం రాశాడు ఆ కుర్రాడు.
కొన్ని రోజుల తర్వాత ఏకంగా రతన్ టాటా దగ్గర నుండే షాంతనుకు ఉత్తరం వచ్చింది. తన ఐడియా బాగుందని మెచ్చుకోవడమే కాకుండా ఫండింగ్‌కు కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత షాంతను తన ప్రాథమిక విద్య కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. కానీ వెళ్లే మందు టాటాకు ఓ మాటిచ్చాడు. తిరిగొచ్చిన తర్వాత టాటా ట్రస్ట్‌కు తన జీవితాన్ని అంకితం చేస్తానని.
షాంతను తన చదువు పూర్తిచేసుకొని తిరిగొచ్చిన కొన్నిరోజులకే తనకు టాటా నుండి ఫోన్ వచ్చింది.. తనకు ఏకంగా అసిస్టెంట్‌గా ఉండాలని ఆఫర్ ఇచ్చారు టాటా. ఆ అవకాశన్ని చేజార్చుకోకుండా షాంతను.. టాటాకు సన్నిహితుడయ్యాడు. బర్త్‌డే వీడియోలో షాంతను టాటా భూజంపై చేయి వేయడాన్ని చూసిన అందరూ.. తనను టాటా మనవడు అనుకున్నారు. కానీ.. కాదు.. కుక్కల మీద ప్రేమ వీరిద్దరిని స్నేహితులను చేసింది. షాంతను మీద నమ్మకం టాటాకు అసిస్టెంట్‌ను చేసింది. తన జీవితంలో అప్పుడే ఆకాశాన్ని అందుకున్న షాంతను వయసు కేవలం 28 ఏళ్లే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com