Smuggling Dolls: ఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలతో బొమ్మల స్మగ్లింగ్

చెన్నై నగరంలో స్మగ్లింగ్ సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు చేసిన 4 ఏనుగు బొమ్మలను స్వాదినం చేసుకున్నారు చెన్నై అటవీశాఖ అధికారులు. నగరంలోని విల్లుపురం కొత్త బస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ బొమ్మలకు సంబంధించి బేరమాడి విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు, విల్లుపురం పోలిసు అధికారులు అరెస్టు చేసారు. ఈ ఘటనలో చెన్నై, తిరుచ్చి, తంజావూరు, దిండిగల్, ధర్మపురి జిల్లాలకు చెందిన 12 మంది స్మగ్లర్లు అరెస్టు అయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో భాగంగా గత కోంత కాలంగా పెద్ద సంఖ్యలో ఎనుగులు బొమ్మలను పెద్ద ఎత్తున సంపన్న కుటుంబాలకు తిరుచ్చికి చెందిన ముఠా విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఏనుగులను చంపి వాటి దంతాలతో బొమ్మలను చేసి విక్రయిస్తోంది సదరు ముఠా. దీని వెనుక అతి పెద్ద స్మగ్లర్లు ఉన్నట్లు గుర్తించారు పోలిసులు. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అక్రమార్కులను కనిపెడ్తామని అధికారులు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com