ఆడుకుంటూ రూపాయి నాణెం మింగిన చిన్నారి.. 90 సెకన్లలో తొలగించిన వైద్యులు

ఆడుకుంటూ రూపాయి నాణెం మింగిన చిన్నారి.. 90 సెకన్లలో తొలగించిన వైద్యులు
చిన్నారులు ఏమీ తెలియని అమాయకులు.. ఇంట్లో పెద్దవాళ్లు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

చిన్నారులు ఏమీ తెలియని అమాయకులు.. ఇంట్లో పెద్దవాళ్లు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే ఏదో ఒకటి చేసి అమ్మానాన్నని ఇబ్బందుల్లో పెడతారు. ఒక్కోసారి అవి ప్రాణాల మీదకు కూడా తెస్తాయి. ఢిల్లీలోని ఓ చిన్నారి ఆడుకుంటూ రూపాయి నాణెం మింగేసింది. అమ్మ వెంటనే చూసింది కాబట్టి సరిపోయింది. హుటాహుటిన పాపని తీసుకుని ఆస్పత్రికి పరిగెట్టడంతో వైద్యులు బాలికను కాపాడగలిగారు. ఏ మాత్రం ఆలస్యం అయినా బాలిక ప్రాణాలకు ముప్పువాటిల్లేది.

న్యూఢిల్లీలోని మోతీ బాగ్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ చిన్నారి ఆడుకుంటూ రూపాయి నాణెం మింగేసింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం దక్షిణ ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు నాణేన్ని తీయడంలో విఫలమయ్యారు. అనంతరం బాలికను వసంత్‌ కుంజ్‌లోని ఫోర్టిస్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ అత్యంత తీవ్రమైన పరిస్థితిని ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించి, కేవలం 90 సెకన్లలో ఇరుక్కుపోయిన నాణేన్ని బయటకు తీసి చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఎండోస్కోపీ టూత్ ఫోర్సెప్స్ సహాయంతో బాలిక అన్నవాహికలో ఇరుక్కున్న నాణేన్ని బయటకు తీయడంలో వైద్యుల బృందం విజయం సాధించింది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

అన్నవాహికలో నాణెం ఇరుక్కుపోవడంతో బాలిక ముఖం, మెడ, ఛాతీ భాగం వాచిపోయాయి. దీంతో చిన్నారి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడింది. ఈ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రికి చెందిన డా. శుభం వాత్సయ్య నేతృత్వంలోని వైద్యుల బృందం అన్నవాహికలో ఇరుక్కున్న నాణేన్ని బయటకు తీసి చిన్నారి ప్రాణాలను కాపాడారు.

దీని గురించి ఆసుపత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్ అన్నవాహికలో నాణెం ఇరుక్కుంటే ప్రాణహాని ఉంటుందని, అందుకే వెంటనే ఎండోస్కోపీ సాయంతో దాన్ని తీసే ప్రక్రియను ప్రారంభించామని శుభమ్ వాత్సయ్య తెలిపారు. ఈ నాణెం సకాలంలో తొలగించకపోతే, అది ప్రాణాంతకం కావచ్చు. అప్పటికే అన్నవాహిక పగిలిపోయిందని, పరిస్థితి ప్రాణాపాయంగా ఉండేదని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story