Election Commission: ఆ మెసేజ్‌ ఫేక్‌.. ఎన్నికల షెడ్యూల్‌ ప్రచారంపై ఈసీ క్లారిటీ

Election Commission:  ఆ మెసేజ్‌ ఫేక్‌.. ఎన్నికల షెడ్యూల్‌ ప్రచారంపై ఈసీ క్లారిటీ
అలర్ట్ చేసిన ఈసీ

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాల నుంచి మొదలుపెట్టి విపక్షాల వరకూ అందరి చూపు ఈసీవైపే. ఈ తరుణంలో ఈసీ పేరుతో ఓ షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ తేదీ, ఫలితాలు ఇలా అన్ని తేదీలూ ఉన్నాయి. దీంతో నాలుగు రోజుల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 28 వరకూ గడువు ఇచ్చారు. అలాగే వచ్చే నెల 19న పోలింగ్ జరగబోతోంది. మే 22న కౌంటింగ్ జరిగి ఫలితాలు ప్రకటిస్తారు. మే 30న కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఈ మేరకు వచ్చిన షెడ్యూల్ పై రాజకీయ పార్టీల్లో నిజమా కాదా అనే చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న షెడ్యూల్ పై ఈసీ స్పందించింది. లోక్ సభ ఎన్నికల సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో ఓ ఫేస్ మెసేజ్ సర్కులేట్ అవుతోందని ఈసీ తెలిపింది.

ఈ ప్రకటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తాము ఇప్పటి వరకు ఏ తేదీలనూ ప్రకటించలేదని, వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతోన్న షెడ్యూల్ మెసేజ్ నకిలీది అని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ సందేశాలను ఇతరులకు పంపించే ముందు ధ్రువీకరించుకోవాలని సూచించింది. కాగా, మార్చి 12 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేరుతో ఓ షెడ్యూల్ షేర్ అవుతోంది. మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 19న పోలింగ్, మే 22న ఓట్ల లెక్కింపు, మే 30న ప్రభుత్వ ఏర్పాటు అని ఆ ఫేక్ షెడ్యూల్‌లో ఉంది. అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికలను ప్రకటించే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story