BLUE DAIMOND: ప్రపంచ వేదిక మీద మెరుస్తున్న తెలంగాణ వజ్రం

తెలంగాణ మట్టిలో పుట్టిన ‘గోల్కొండ బ్లూ డైమండ్’ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరుస్తోంది. భారతదేశంలోని గోల్కొండ ప్రాంతం నుంచి తవ్విన ఈ అరుదైన నీలి వజ్రం.. వజ్రాల చరిత్రలో ఒక అద్భుత మణిగా పేరును సంపాదించుకుంది. వందల ఏళ్ల పాటు రాజవంశాల ఆభరణంగా వెలిగిన ఈ వజ్రం.. ఇప్పుడు మళ్లీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల మే 14న, స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో జరగనున్న ప్రఖ్యాత ‘సోత్‌బై’ వేలంలో దీనిని ప్రదర్శించనున్నారు. అంచనా ప్రకారం, దీని ధర సుమారు రూ. 430 కోట్లు (సుమారు 50 మిలియన్ అమెరికన్ డాలర్లు) వరకు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రాచీన భారతీయ సంపదలో ఒక భాగంగా ఉన్న ఈ వజ్రం.. ఇప్పుడైతే ప్రైవేట్ వ్యక్తుల కళ్లను మళ్ళిస్తోంది.
గోల్కొండ బ్లూ వజ్రం ప్రత్యేకత?
ఈ వజ్రం బరువు 23.24 క్యారెట్లు. నీలి రంగులో .. మెరిసిపోతుంది. దీనిని Type IIb వజ్రం అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలో 0.1% కన్నా తక్కువ మోతాదులో మాత్రమే లభించేవి. ఇవి విద్యుత్ ప్రసరణ చేసే ప్రత్యేక లక్షణం కలిగి ఉంటాయి. ఈ వజ్రాల ఉత్పత్తి చాలా అరుదు, అందుకే వీటి విలువ కోట్లలో ఉంటుంది.
చరిత్రలోకి వెళ్లి చూస్తే..
ఈ వజ్రం తొలి సారిగా గోల్కొండ మైదానాల్లో తవ్విన వజ్రం. అప్పట్లో ఇది ఇండోర్ మహారాజు చేతిలో ఉండేది. ఆ తరువాత బరోడా రాజవంశానికి చేరింది. రాజ వంశాల భూషణంగా సాగిన ఈ వజ్రం తరువాత యూరప్ చేరి, ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ప్రైవేట్ సేకరణలో ఉంది. ఇంత చరిత్రను అనుభవించిన ఈ వజ్రం ఇప్పుడు మళ్లీ వేలంలోకి అడుగుపెట్టింది. ఇతర వజ్రాలలో గోల్కొండ వజ్రాలను కలిపి చూస్తే ఇవి ప్రత్యేకంగా కనిపించేవి. ఇవి అరుదుగా దొరుకుతాయి. పారదర్శకత అధికంగా ఉంటుంది. చూడగానే కంటికి చాలా స్వచ్ఛంగా కనిపిస్తాయి. రాయిగుంట కాంతి వెదజల్లుతుంది. వీటి నాణ్యత కూడా అధికంగా ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com