అత్యంత ఎత్తులో ఉన్న ప్రాచీన శివాలయం ఒరిగిపోతోంది

అత్యంత ఎత్తులో ఉన్న ప్రాచీన శివాలయం ఒరిగిపోతోంది
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన తుంగనాథ్‌ శివాలయం ఒరిగిపోతోంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో, 12వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో తుంగనాథ్‌

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన తుంగనాథ్‌ శివాలయం ఒరిగిపోతోంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో, 12వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో తుంగనాథ్‌ ఆలయాన్ని .. 8వ శతాబ్ధంలో కాత్యూరీ రాజులు నిర్మించారు. ఈ ఆలయం సుమారు 6 డిగ్రీల నుండి, 10 డిగ్రీల మేర వాలుతోందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. తాజా పరిణామాల దృష్ట్యా ఆలయాన్ని రక్షిత కట్టడాల జాబితాలోకి చేర్చాలని, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు పురావస్తు శాఖ అధికారులు.

శివాలయం ఒరిగిపోవడానికి గల కారణాలు గుర్తించి, సరిచేస్తామంటున్నారు అధికారులు. అత్యంత వివరణాత్మక అధ్యయనాన్ని నిర్వహించాల్సి ఉందని, నిపుణులను సంప్రదించి ఆలయం కుంగుబాటుకు గల కారణాలు అన్వేషించి, పునాది రాయి మార్చాల్సి వస్తే, మారుస్తామన్నారు. బద్రీ, కేదార్‌ నాథ్ ఆలయ కమిటీకి కూడా లేఖను పంపించామని తెలిపారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story