రాహుల్, సోనియా ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్..

రాహుల్, సోనియా ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్..
కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం మంగళవారం భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్

బెంగళూరు నుంచి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం మంగళవారం భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు భోపాల్ పోలీసులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం అకస్మాత్తుగా ల్యాండింగ్ అయిందని పేర్కొన్నారు.

భోపాల్ నుంచి రాత్రి 9.30 గంటలకు విమానం టేకాఫ్ అవుతుందని భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారి మిశ్రా తెలిపారు.

కొద్ది గంటల క్రితం బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ హాజరయ్యారు.

"ఎమర్జెన్సీ ల్యాండింగ్ గురించి సమాచారం అందుకున్న మేము విమానాశ్రయానికి వెళ్తున్నాము" అని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శోబా ఓజా చెప్పారు..

Tags

Next Story