Himachal Pradesh: నదిలో కారు నడిపిన పర్యాటకుడు , పోలీసుల చలాన్

హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పోటెత్తారు. ఫలితంగా రహదారులపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ఓ వాహనదారుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉందని నదిలో నుంచి తన వాహనంలో ప్రయాణించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంలో పోలీసులు చలాన్ విధించారు.
వరుస సెలవులతో ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు ఓ వాహనదారుడు రోడ్డు మార్గాన్ని వదిలి ఏకంగా నదిలో నుంచి ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. లహాల్ వ్యాలీలో ఉన్న చంద్రా నదిలో నుంచి కొందరు ప్రయాణికులు థార్ ఎస్‌యూవీలో ప్రయాణించారు. ఆ సమయంలో నదిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, పర్యాటకుల తీరుపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా నీటి వనరులను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇకనైనా పర్యాటకుల రాకపై పరిమితి విధించాలని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ నెటిజెన్ పోస్ట్ చేశాడు. లేకపోతే దిల్లీకి పర్యాటక ప్రాంతాలకు పెద్ద తేడా ఉండదని అన్నాడు.
మరోవైపు సామాజిక మాధ్యమంలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. నదిలో ప్రయాణించిన వాహనానికి చలానా విధించారు. చంద్రా నదిలో థార్ వాహనాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఘటన తమ దృష్టికి వచ్చిందని స్థానిక ఎస్పీ తెలిపారు. సదరు వాహనంపై చర్యలు తీసుకున్నామని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు. గత మూడు రోజుల్లో అటల్ టన్నెల్ మార్గంలో దాదాపు 55 వేల వాహనాలు ప్రయాణించాయని అధికారులు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల కోసం ఈ వారంలో మరో లక్షకు పైగా వాహనాలు శిమ్లాకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.
ఈ క్రమంలో గత మూడు నాలుగు రోజులలో ఆయా ప్రాంతాలలో.. యాభై ఐదు వేలకు పైగా వాహనాలు ప్రయాణించాయని అధికారులు తెలిపారు. ఇంకా న్యూ ఇయర్ కూడా త్వరలో రానుండడంతో ఈ వారం మరో లక్షకు పైగా వాహనాలు.. అక్కడికి చేరుకునే అవకాశం ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి సుక్వీందర్ సింగ్ మాట్లాడుతూ.. పర్యాటకులకు ఎటువంటి అంతరాయాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com