ఉపాధ్యాయురాలి దుర్మార్గం.. పోలీసులు అరెస్ట్

ఉపాధ్యాయురాలి దుర్మార్గం.. పోలీసులు అరెస్ట్
ఆమె చదువుకుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం కూడా చేస్తోంది.

ఆమె చదువుకుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం కూడా చేస్తోంది. అయినా కొంచెం కూడా సంస్కారం లేకుండా వృద్ధాప్యంలో ఉన్న అత్తగారిని నానా హింసలు పెడుతోంది. అత్త అమ్మ కాకపోయినా వయసుకు అయినా గౌరవం ఇవ్వకుండా కొట్టడం కూడా మొదలు పెట్టింది.

తేవలక్కరలోని నడువిలక్కరకు చెందిన మంజుమోల్ థామస్ అనే మహిళ ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెక్కుంభాగాం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పాఠశాల ఉపాధ్యాయురాలైన 37 ఏళ్ల మహిళ, వృద్ధ అత్తగారిని కొట్టడం, నెట్టడం వీడియోలో కనిపిస్తుంది. దాంతో ఆమె కిందపడిపోయి నొప్పితో ఏడుస్తుంది. కొల్లాంలో ఈ ఘటన జరిగింది.

అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ మహిళపై చర్య తీసుకోవాలని, కేరళ పోలీసులను ట్యాగ్ చేసి జోక్యం చేసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకున్నారు. వీడియో ఆన్‌లైన్‌లో కనిపించిన కొన్ని గంటల్లోనే ఆమెను అరెస్టు చేశారు.వృద్ధురాలిని దుర్భాషలాడుతూ చిత్ర హింసలు పడుతున్న ఆ మహిళ చిన్నారులకు పాఠాలు ఎలా చెబుతోంది అని వినియోగదారులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

బుధవారం సాయంత్రం దాడికి గురైన ఆమె అత్త ఎలియమ్మ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందగా, ఆమె తన కుమారుడు జైసిన్, అతని స్నేహితుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. మంజుమోల్‌పై సంక్షేమ చట్టంలోని సెక్షన్ 24 మరియు IPC 308 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story