Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో హింసాకాండ

రాజస్థాన్‌లో ఎన్నికల సందర్భంగా హింసాకాండ చోటుచేసుకుంది. హింసాకాండలో అగంతకులు బైక్‌లు, కార్లకు నిప్పు పెట్టారు. రాళ్లదాడిలో అనేక ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు 100 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాలలోకి వెళ్తే…. రాజస్థాన్ లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. దేవల్ ఉనియారా సీటు కూడా వీటిలో ఒకటి. ఎన్నికల బరిలో నిలిచిన నరేష్ మీనా కూడా స్వతంత్ర అభ్యర్థి సంరవత గ్రామంలో ఓటింగ్ సందర్భంగా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఈవీఎంలో తన ఎన్నికల గుర్తు అస్పష్టంగా ఉందని ఆరోపించారు. అక్కడితే ఆగకుండా పోలింగ్ బూత్ వద్ద ఏసీడీఎం అమిత్ చౌదరిని నరేష్ మీనా చెప్పుతో కొట్టారు. దీంతో పోలీసులు నరేష్ మీనాను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా నరేష్ మీనా మద్దతుదారులు రాత్రి వేళలో రచ్చ సృష్టించారు. మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నరేష్ మీనా మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారని, అగ్నిప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీంతో స్పందించిన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. నరేష్ మీనాపై నాగర్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయి. ఈ హింసాత్మక ఘటనలో పలువురు గ్రామస్తులు కూడా గాయపడ్డారు. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
హింసాకాండ ఘటన తర్వాత సమర్వాత గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. నిరసన జరుగుతున్న పోలింగ్ బూత్ వద్ద కవరేజీ కోసం స్థానిక జర్నలిస్టులు కూడా ఉన్నారు. హింస చెలరేగినప్పుడు, జర్నలిస్టులు పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. రాజస్థాన్‌లోని దౌసా, డియోలీ-ఉనియారా, ఝుంఝును, ఖిన్వ్‌సర్, చౌరాసి, సాలంబర్, రామ్‌గఢ్‌తో సహా ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఓటింగ్ జరిగింది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com