వారి పంట పండింది.. టమోటాలు అమ్మి కోటీశ్వరుడైన రైతు కుటుంబం..

వారి పంట పండింది.. టమోటాలు అమ్మి కోటీశ్వరుడైన రైతు కుటుంబం..
మహారాష్ట్ర రైతు టమోటాలు అమ్మి నెల రోజుల్లో కోటీశ్వరుడయ్యాడు.

దేశంలో టమోటా ధర పెరగడంతో రోజుకో కథ వినిపిస్తోంది. ఎక్కడ చూసినా పెరిగిన టమోటా ధరల గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది టమోటా పండించే రైతులకు ఆనందంగానే ఉంది. టమోటాల కథ విచిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి రేటు లేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా రార రైతు వేదనతో కష్టపడి పండించిన పంటంతా తానే స్వయంగా రోడ్డు మీద పారబోస్తాడు.. అదే ఒక్కోసారి టమోటా రేటు అందనంత ఎత్తులో ఉంటుంది. పెరిగిన టమోటా ధరలు ప్రస్తుతం రైతులను కోటీశ్వరులను చేస్తున్నాయి.

మహారాష్ట్ర రైతు టమోటాలు అమ్మి నెల రోజుల్లో కోటీశ్వరుడయ్యాడు. మహారాష్ట్రలోని జున్నార్‌కు చెందిన ఓ రైతు 13 వేల కిలోల టమోటాలను విక్రయించి నెలలో రూ.1.5 కోట్లు సంపాదించాడు. ప్రస్తుతం టమాట సాగుచేస్తున్న జున్నార్‌లోని పలువురు రైతులు కోటీశ్వరులుగా మారారు.

దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన రైతుకు జాక్‌పాట్ తగిలింది. తుకారాం భాగోజీ గయాకర్ అతని కుటుంబం నెలలో 13,000 కిలోల టొమాటో విక్రయించడం ద్వారా రూ. 1.5 కోట్లకు పైగా సంపాదించారు.

తుకారాంకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, 12 ఎకరాల భూమిలో కుమారుడు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలి సహకారంతో టమాట సాగు చేశాడు. తాము నాణ్యమైన టమోటాలు పండిస్తున్నామని తెలిపారు. నారాయణగంజ్‌లో ఒక టమాటా క్రేట్ ను అమ్మడం ద్వారా రైతు ఒక్కరోజులో రూ.2,100 సంపాదించాడు. గయాకర్ శుక్రవారం నాడు మొత్తం 900 క్రేట్లను విక్రయించి ఒక్కరోజులోనే రూ.18 లక్షలు సంపాదించాడు. గత నెలలో టమాటా డబ్బాలను నాణ్యత ఆధారంగా ఒక్కో క్రెట్‌కు రూ.1000 నుంచి 2,400 వరకు విక్రయించగలిగాడు. పూణె జిల్లాలోని జున్నార్‌లో టమోటాలు పండిస్తున్న చాలా మంది రైతులు కోటీశ్వరులుగా మారారు.

ఈ కమిటీ టమాట విక్రయం ద్వారా నెల రోజుల్లో రూ.80 కోట్ల వ్యాపారం చేసి ఆ ప్రాంతంలో 100 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించింది. తుకారాం కోడలు సోనాలి మొక్కలు నాటడం, పంట కోయడం, ప్యాకేజింగ్ చేయడం వంటి పనులను నిర్వహిస్తుండగా, అతని కుమారుడు ఈశ్వర్ క్రయ విక్రయాలు పర్యవేక్షిస్తుంటాడు. మార్కెట్‌కు అనుకూలమైన పరిస్థితులు నెలకొనడంతో గత మూడు నెలలుగా శ్రమించిన ఫలితం దక్కింది.

నారాయణగంజ్‌లో ఉన్న ఝున్ను వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ మార్కెట్‌లో నాణ్యమైన (20 కిలోలు) టమాటా అత్యధికంగా రూ.2,500, అంటే కిలో రూ.125. టమోటాలు అమ్మి రైతులు లక్షాధికారులుగా మారడం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాదు. కర్నాటకలోని కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం ఈ వారం 2,000 టమాట పెట్టెలను విక్రయించి రూ.38 లక్షలతో ఇంటికి తిరిగి వెళ్లారు. టమోటా ధర పెరగడం కొనే వారికే గానీ, అమ్మే వారికి ఆనందంగానే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story