AKHILESH: ఈ ఎన్నికలు.. ఓ జాతీయ ఉద్యమం

సార్వత్రిక ఎన్నికలను రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్న జాతీయఉద్యమంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. పార్టీ నేతలంతా దేశ తలరాతను మార్చేందుకు సమాయత్తమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు చారిత్రాత్మకమైనవని. వాటిద్వారా రాజ్యాంగాన్ని, సామాజిక విలువలను కాపాడవచ్చని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన అఖిలేష్ అధికార పార్టీ ఒత్తిలకు తలొగ్గదని ఎస్పీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇండియా కూటమి అభ్యర్థులకు పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఇండియా కూటమి విజయం రాజ్యాంగ నిర్మాతలకు నిజమైన నివాళి అని ఎస్పీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు జరిగిన మూడుదశల పోలింగ్‌లో ఇండియా కూటమి విజయానికి ప్రజలు పటిష్ఠ పునాది వేశారని...రాబోయే దశల్లో వారి మద్దతు కొనసాగుతుందని అఖిలేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
దశ దిశ మార్చేవి: కేజ్రీవాల్
దేశం దిశ, దశను మార్చడానికి జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం తొలిసారి కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గంలో.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ రోడ్ షో... నిర్వహించారు. జూన్4న చారిత్ర్మాక ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని. ఇండియా కూటమి అధికారంలోకి వస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. చరిత్ర మలుపు తిరగబోతుందని బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ భవిత్యం మారిపోతుందన్నారు. తాను నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని తనకు ప్రజలకు మద్దతు కావాలని అభ్యర్థించారు. దేశం ఎప్పుడూ ఏ నియంతను అంగీకరించలేదని అలాంటి వారిని అధికారం నుంచి తొలగించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతిచోట్ల బీజేపీ ఓడిపోతుందని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీలో 75 ఏళ్లు వచ్చిన వారు రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని నియమం పెట్టిన మోదీ... అమిత్ షాను ప్రధానిని చేసేందుకే ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని కేజ్రివాల్ ఆరోపించారు. జూన్ 4 తర్వాత కేంద్రంలో NDA ప్రభుత్వం ఏర్పడబోదని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన కేజ్రివాల్ .. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతిపక్ష నేతలందరినీ జైలులో పెడుతుందని ఆరోపించారు. జూన్ 4తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. హరియాణ, రాజస్థాన్, బిహార్ , యూపీ, ఢిల్లీ, కర్ణాటక,పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లలో NDA గెలిచే స్థానాలు. గణనీయంగా తగ్గిపోతాయని జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భాగస్వామిగా ఉంటుందన్న కేజ్రివాల్ నియంతకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నట్లు చెప్పారు. తనకు..140 కోట్ల మంది ప్రజలు అండగా నిలవాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com