Jagdeep Dhankhar: నూతన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ బ్యాక్‌గ్రౌండ్..

Jagdeep Dhankhar: రాజస్థాన్ లోని కుగ్రామం కిథానాలోని జాట్ కుటుంబంలో 18 మే 1951లో జగ్‌దీప్ ధన్‌కర్ జన్మించారు. తల్లిదండ్రులు గోకల్ చంద్, కేసరి దేవి. 1979లో సుధేష్‌తో ధన్‌కర్ వివాహమైంది. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియుమితులైన ధన్‌కర్... ఎన్డీఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే వరకు ఆ పదవిలో ఉన్నారు. స్వగ్రామం కిథానాలోనే పాఠశాల విద్యనభ్యసించారు. జైపూర్‌లో బీఎస్సీ డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు.
1979లో న్యాయవాదిగా ప్రాక్టీసు ఆరంభించారు. 1990లో రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ప్రమోట్ అయ్యారు. సుప్రీంకోర్టుతో సహా పలు హైకోర్టుల్లో పలు కేసులు వాదించారు. 1989లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ధన్‌కర్... 1989లో తొమ్మిదో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. జనతాదళ్ తరపున జున్‌జున్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు.
1990-91లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రిగా పనిచేశారు. 1993 నుంచి 98 వరకు రాజస్థాన్‌లోని కిషన్ ఘర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ధన్‌కర్...బీజేపీలో చేరి పలు పదవులు నిర్వహించారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ధన్‌కర్‌గా నియమితులయ్యారు. తాజాగా భారత 16వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com