Chintan Shivir: ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చింతన్ శిబిర్.. మూడు రోజుల పాటు..

Chintan Shivir: ఇవాల్టి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించనున్నారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సదస్సులో ఆరు బృందాలుగా 400 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
రాజకీయాలు, సామాజిక న్యాయం, సాధికారతపై సదస్సులో చర్చించనున్నారు. భవిష్యత్ పొత్తుల వ్యూహ రచనపై చింతన్ శిబిర్‌లో చర్చించనున్నారు. ఆర్థిక వ్యవస్థ, పార్టీ సంస్థాగత స్థితిగతులపై సదస్సులో చర్చ జరగనుంది. ఆయా అంశాలపై ఆరు బృందాలు నివేదికలు సమర్పించనున్నాయి. చివరి రోజు రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత డిక్లరేషన్ ప్రకటించనున్నారు. చివరి రోజు జరగనున్న CWC భేటీలో డిక్లరేషన్‌పై చర్చించనున్నారు. నవ సంకల్ప తీర్మానాన్ని CWC ఆమోదించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com