Haryana : కుటుంబసభ్యుల ముందే ముగ్గురు మహిళలపై..

Haryana :  కుటుంబసభ్యుల ముందే ముగ్గురు మహిళలపై..
భర్త, పిల్లల ముందే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం

నలుగురు వ్యక్తులు కత్తులు, కటార్లు తీసుకొని వచ్చి బలవంతంగా ముగ్గురు మహిళలపై వారి కుటుంబసభ్యుల ముందే సామూహిక అత్యాచారం చేసిన ఘటన హర్యానాలో జరిగింది. పానిపట్ పట్టణంలో నలుగురు సాయుధులైన వ్యక్తులు వచ్చి బెదిరించి పురుషులను కట్టివేసి, వారి ముందే వారి మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు.

బుధవారం రాత్రి 1 గంటలకు మట్లాడ గ్రామ శివారులోని పొలాల్లో ఉన్న పలు ఇళ్లలో దొంగలు పడ్డారు. ఓ ఇంటిలోకి చొరబడ్డ నలుగురు దొంగలు.. తల్వార్లు, తుపాకులతో బెదిరించి అక్కడున్న మూడు కుటుంబాల సభ్యులందరినీ తాళ్లతో కట్టేశారు. 24, 25, 35 ఏళ్ల వయసున్న ముగ్గురు మహిళలపై ఆ దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అనంతరం రూ.13వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని పరారయ్యారు. భర్తలు, పిల్లల ఎదుటే తమపై గ్యాంగ్ రేప్ జరిగిందని బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దుండగులు దాదాపు 3 గంటల పాటు దొంగలు తమ ఇంట్లోనే ఉన్నారని.. అత్యాచారం చేసే సమయంలో అరుపులు బయటికి వినిపిస్తే తుపాకీతో కాల్చి చంపుతామని వార్నింగ్ ఇచ్చారని కంప్లయింట్ లో పేర్కొన్నారు. ఇక వారు పారిపోయే క్రమంలో.. మరో ఇంట్లోకి చొరబడి ఓ మహిళపై దాడి చేసి రూ.5వేలు దోచుకున్నారు. దొంగలు దాడిచేసిన అనంతరం ఆ మహిళ చికిత్సపొందుతూ చనిపోయింది. నెల రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఈ ఇళ్ల వద్దకు వచ్చి.. వెంటనే స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఆనాడు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తులకు.. అఘాయిత్యాలకు తెగబడిన నలుగురు దుండగులతో సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story