తేజస్వియాదవ్‌పై చెప్పులు విసిరిన దుండగులు

బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ కూటమికి చేదు అనుభవం ఎదురైంది. ఔరంగాబాద్ జిల్లా కుటుంబ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా... తేజస్వియాదవ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం కోసం వచ్చిన తేజస్వి.. సభా వేదికపై కూర్చోగా ఆయనకు మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ తరుణంలో అకస్మాత్తుగా ఆయన వైపు రెండు చెప్పులు దూసుకొచ్చాయి. వాటిలో ఒకటి ఆయన తల పక్క నుంచి వెనక్కి వెళ్లిపోగా.. మరో చెప్పు మాత్రం ఆయన చేతులకు తగిలింది.
అయితే ఈ ఘటన అనంతరం తన ప్రసంగం మొదలు పెట్టిన తేజస్వి.... ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తేజస్విపై చెప్పులు విసిరిన ఘటనను ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల బహిరంగ సభల్లో నేతలకు సరైన భద్రతా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది అధికారపక్షం కుట్రేనని తివారీ ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com