అమెజాన్ భారీ తొలగింపుల మధ్య థైరోకేర్ వ్యవస్థాపకుడి పోస్ట్ వైరల్..

థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ వేలుమణి ఇటీవల X లో అమెజాన్, మెటా మరియు గూగుల్ వంటి టెక్ కంపెనీలలో భారీ తొలగింపులు తనని కలచి వేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయిన ఆ వ్యక్తి యొక్క భావోద్వేగాన్ని కూడా హైలెట్ చేశారు.
తన పోస్ట్‌లో, ప్రధాన బ్రాండ్‌లలో ఉద్యోగాలు సంపాదించిన వ్యక్తులు ఎంత సంతోషంగా ఉంటారో, ఆ తరువాత ఆ ఉద్యోగం పోతే ఎంత బాధగా ఉంటుందో వేలుమణి ప్రతిబింబించారు. సంవత్సరానికి $3.5 బిలియన్ల ఖర్చులను ఆదా చేయడానికి అమెజాన్ 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు వచ్చిన నివేదికలకు ప్రతిస్పందనగా ఆయన పోస్ట్ వచ్చింది.
"ఇలాంటి బ్రాండ్లతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందినందుకు ఎంతమంది సంబరాలు చేసుకున్నారో ఊహించుకోండి. ఇప్పుడు ఎంతమంది నిరాశకు గురవుతారో! ఉద్యోగం పొందినందుకో లేదా ప్రమోషన్ వచ్చిందనో సంబరాలు జరుపుకోకండి.. కెరీర్ లేదా వ్యాపారం - ఇది మారథాన్ రేస్" ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని థైరోకేర్ వ్యవస్థాపకుడు రాశారు.
వేలుమణి పోస్ట్ నెటిజెన్ల దృష్టిని ఆకర్షించింది. ఇది ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది, చాలా మంది వినియోగదారులు నేటి ఉద్యోగ మార్కెట్లో అనుకూలత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
నిజంగానే ఇది మారథాన్ రేసు. పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు" అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. "ఉద్యోగం, వ్యాపారాల్లో ఎత్తు పల్లాలు అనివార్యం అని మరొకరు వివరించారు.
"కలామ్ సర్ చెప్పినట్లుగా కంపెనీకి విధేయంగా ఉండాల్సిన అవసరం లేదు, మీ పనికి విధేయంగా ఉండండి" అని మరొకరు రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com