Kuno National Park: పట్టుకోవడానికి వెళ్ళి పులిని చంపేసిన అటవీ అధికారులు

వారిపై దాడిచేసేందుకు యత్నించడంతో కాల్పులు

పులిని పట్టుకోవడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై అది ఒక్కసారిగా దాడి చేసింది. దాంతో ఆత్మరక్షణ కోసం అధికారులు ఆ పులిని కాల్చి చంపారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఇటీవల అటవీ ప్రాంతం నుంచి సమీప జనావాసాల్లోకి వచ్చిన పులి.. అక్కడ కొన్ని పశువులను చంపింది.

ఈ నేపథ్యంలో దాన్ని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్లు గుర్తించిన అటవీ సిబ్బంది దానికి మత్తుమందు ఇవ్వడానికి ప్రయత్నించారు. 15 మీటర్ల దూరం నుంచి దానిపై తుపాకీతో ట్రాంక్విలైజర్‌ (మత్తు మందు) ను ప్రయోగించారు. దాంతో అది ఒక్క ఉదటున అధికారులపై దూకింది.

దాడి చేస్తుండగా ఆత్మరక్షణ కోసం అటవీ సిబ్బంది వెంటనే దానిపై కాల్పులు జరపారు. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆ పులి మృతి చెందినట్లు అటవీశాఖ సీనియర్‌ అధికారులు వెల్లడించారు. మృతిచెందిన పులి వయసు పదేళ్లు ఉంటుందని తెలిపారు.

Tags

Next Story