Tiger pee: లీటర్‌ మూత్రం రూ.2400.. దేనిదంటే?

Tiger pee: లీటర్‌ మూత్రం రూ.2400.. దేనిదంటే?
X
ఆ రోగం తగ్గుతుందని ప్రచారం

బ్బు సంపాదించడంలో చైనా వాళ్ల తెలివే వేరుగా ఉంటుంది. చైనాలో తయారు చేసిన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా పులి మూత్రాన్ని కూడా విక్రయించి.. చైనావాసులు డబ్బులు సంపాదిస్తున్నారు. చైనాలో ఉన్న ఓ జూ నిర్వాహకులు.. పులి మూత్రాన్ని సేకరించి.. దాన్ని విక్రయిస్తున్నారు. ఈ పులి మూత్రంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని పేర్కొంటూ.. భారీ ధరకు అమ్మేస్తున్నారు. పావు లీటర్ పులి మూత్రాన్ని రూ.600కు విక్రయిస్తూ.. కాసుల పంట పండించుకుంటున్నారు. అయితే వివిధ రకాల సమస్యలకు ఈ పులి మాత్రం ఔషదంగా పనిచేస్తుందని ఆ జూ నిర్వాహకులు చెబుతుండటం గమనార్హం. అయితే డాక్టర్లు, నెటిజన్లు మాత్రం దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

చైనా మీడియా వెల్లడించిన కథనం ప్రకారం.. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని "ది యాన్‌ బైఫెంగ్సియా" అనే వైల్డ్ లైఫ్ జూ నిర్వాహకులు పులి మూత్రాన్ని విక్రయిస్తున్నారు. ఈ పులి మూత్రాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో వాడితే ప్రయోజనం ఉంటుందని ఆ జూ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సైబీరియన్‌ పులుల నుంచి సేకరించిన మూత్రాన్ని పావు లీటర్‌ సీసాను రూ.600 చొప్పున విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అంటే ఒక లీటర్ పులి మూత్రం రూ.2400 పలుకుతోంది. కీళ్లవాతం, ఎముకలు బెణకడం, కండరాల నొప్పులకు ఈ పులుల మూత్రం ఔషధంగా పని చేస్తుందని ప్రచారం కూడా చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే.. ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా తమ వద్ద ఉన్నాయంటూ.. దబాయిస్తున్న వైనం అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పులి మూత్రం విక్రయాలకు సంబంధించి చైనా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story