Yusuf Pathan: దౌత్య బృందంలో యూసఫ్ పఠాన్.. కేంద్రాన్ని తప్పుపట్టిన తృణమూల్ కాంగ్రెస్..

పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం పూనుకుంది. ఇందుకోసం ఆయా దేశాలు వెళ్లేందుకు బృందాలను ఏర్పాటు చేశాయి. అయితే ఎంపీల పేర్లు ఇవ్వాలంటూ ఆయా పార్టీలకు కేంద్రం లేఖలు రాసింది. కానీ విచిత్రం ఏంటంటే.. పార్టీలు ప్రతిపాదించకుండానే కేంద్రం దౌత్య బృందాలను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే శశిథరూర్ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. తాజాగా తమను సంప్రదించకుండా యూసఫ్ పఠాన్ పేరును దౌత్య బృందంలో చేర్చడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
తమను సంప్రదించకుండానే యూసఫ్ పఠాన్ ఎంపిక జరిగిందంటూ ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ అన్నారు.ఒక పార్టీ ఎంపీని ఎంపిక చేసేటప్పుడు ఆ పార్టీతో సంప్రదింపులు జరపాలని కేంద్రానికి సూచించారు. అంతేకాక.. కేంద్రం నిర్ణయించిన దౌత్య బృందం పర్యటనకు పఠాన్ వెళ్లడం లేదని స్పష్టంచేశారు. విమర్శలు రావడంతో బృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ పఠాన్ తప్పుకున్నారు.
ఆల్ పార్టీకి చెందిన దౌత్య మిషన్‌ను బహిష్కరించడం లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ తెలిపారు. ఇవాళ ఆమె ఈ విషయంపై స్పందించారు. తమ ప్రతినిధిని పంపాలంటూ కేంద్రం నుంచి రిక్వెస్ట్ రాలేదని, ఒకవేళ ఆ అభ్యర్థన వస్తే, కచ్చితంగా ప్రతినిధిని పంపుతామని మమతా బెనర్జీ చెప్పారు. ప్రతినిధుల పేర్లు చెప్పే హక్కు పార్టీలకు ఉంటుందని, కేంద్రానిది కాదు అని ఆమె అన్నారు. కేవలం పార్లమెంటరీ పార్టీకి చెప్పడం సరికాదు అని, పాలసీ నిర్ణయాలను పార్లమెంటరీ పార్టీ తీసుకోదన్నారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే ఉగ్రవాదులు చనిపోతే వారికి పాక్ సైన్యం హాజరుకావడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇస్తుందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పాక్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేతలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లో ముస్లిం ఎంపీలు ఉండేలా చూసింది. మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా విదేశాల్లో పర్యటించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com