కొండెక్కి కూర్చున్న టమాట.. కేజీ రూ. 250 అట.. .

టమాటా పండించే కీలక ప్రాంతాల్లో నెలకొన్న వేడిగాలులు, అలాగే భారీ వర్షాలు, సరఫరాకు అంతరాయం కలిగించడం వల్ల ధరలు భారీగా పెరగడానికి కారణమని అంటున్నారు.
కేజీ చికెన్ కూడా అంత రేటు ఉండదేమో. టమోటాల ధరలు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నాయి. గంగోత్రి ధామ్‌లో కిలో టమాట ధర రూ. 250, ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ. 180 నుండి 200 వరకు ఉంది.ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా ప్రియమైందని కూరగాయల విక్రయదారుడు తెలిపారు.
ఉత్తరకాశీలో టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వాటిని కొనేందుకు కూడా ఇష్టపడడం లేదు. టొమాటోలు ధర ఎక్కువ కదా అని తక్కువ ధర ఉన్నప్పుడు కొని నిల్వ చేసుకోవడానికి ఉండదు. కొన్ని రోజులకే పాడైపోతాయి. ఇది వాటి ధరలపై కూడా ప్రభావం చూపుతుందని విశ్వసిస్తున్నారు.
చెన్నైలో, టమోటాలు కిలో రూ 100-130 వరకు విక్రయిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని చెన్నైలోని రేషన్ షాపుల్లో కిలోకు రూ. 60 చొప్పున రాయితీ ధరతో టొమాటోలను విక్రయించడం ప్రారంభించింది.
అనేక రాష్ట్రాల మాదిరిగానే కర్నాటకలో కూడా ఇటీవలి రోజుల్లో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి.బెంగళూరులో టమోటా ధరలు కిలోకు రూ 101 నుండి 121 వరకు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్‌లో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల టమాటాకు తెగుళ్లు సోకడంతో మార్కెట్‌లో దిగుబడి తగ్గింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com