Tomato Price: తెలివైన దొంగలు టమాటాలు దోచేశారు

Tomato Price: తెలివైన దొంగలు టమాటాలు దోచేశారు
కర్ణాటకలో తొలి టమాటాలు దొంగతనం కేసు నమోదు.

నిన్న మొన్నటి వరకు బాగా డబ్బులు ఉంటే బంగారం కొనుక్కోవచ్చు అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు బాగా డబ్బులు ఉంటే చక్కగా ఓ రెండు కేజీల టమాటాలు కోవచ్చు. టమాటా పప్పు, టమాట పచ్చడి వండుకోవచ్చు అదే ఆలోచిస్తున్నాము. అందుకే దొంగలు కూడా కొంచెం కొత్తగా ఆలోచించారు. బంగారము, వస్తువులు అయితే కరిగించుకోవడానికి, మార్పించుకోవడానికి చాలా కష్టమవుతుంది సో కొత్తగా ఆలోచించి టమాటాలు కొట్టేశారు..

కర్ణాటక రాష్ట్రంలో ఓ తోటలోని టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే జూలై 4వ తేదీ రాత్రి హసన్ జిల్లాలోని గోని సోమనహళ్లి గ్రామంలోని రూ. 2.5 లక్షల విలువై టమాటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించారు. బెంగళూర్ లో కిలో టమాటా రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్ తరలించాలని యోచిస్తున్న సమయంలో తన 2 ఎకరాల్లోని టమాటాలను దొంగిలించారని మహిళా రైతు ధరణి తన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి పంట చేతికొచ్చే సమయానికి దొంగలు టమాటాలను ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 50-60 బస్తాల టమాటాను తీసుకెళ్లడమే కాకుండా.. మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేసినట్లు చెప్పారు. దీనిపై హళేబీడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది ఎండల తీవ్రత, రుతుపవనాలు ఆలస్యం కావడంతో టమాటా పంట ఘోరంగా దెబ్బతింది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో టమాటాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. తొలుత ఎండల తీవ్రత, వర్షాలు సకాలం కరవకపోవడంతో పాటు ఇటీవల కాలంలో భారీ వర్షాలు పంటను దెబ్బతీశాయి. దీంతో టమాటా డిమాండ్, సప్లైకి మధ్య తేడా వచ్చింది. దీంతో రేట్లు పెరుగుతున్నాయి.





ఇక కర్ణాటక హవెరిలో ఓ కూరగాయల వ్యాపారి మార్కెట్​ ఆవరణలో బుట్టలో కెమెరా ఉంచి టమాటాలు విక్రయించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కృష్ణప్ప అనే ఓ కూరగాయల వ్యాపారికి మార్కెట్​లో శాశ్వతమైన దుకాణం కూడా లేదు. తను కూరగాయలు విక్రయించే స్థలంలో కెమెరాలు బిగించేందుకు అనువైన సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ టమాటా ధరలు పెరుగుతున్నందున.. కూరగాయల పెట్టెలోనే కెమెరా ఉంచి టమాటాలు విక్రయిస్తూ కృష్ణప్ప వార్తల్లోకెక్కాడు. టమాటాలను దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు కృష్ణప్ప ఈ ప్లాన్ వేసాడు.

Tags

Read MoreRead Less
Next Story